వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, సీనియర్ నటి లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘వదలా’. అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో సస్పెన్స్, మిస్టరీ మరియు బలమైన ముక్కోణపు ప్రేమకథా ఎమోషన్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకునే ఒక పర్ఫెక్ట్ దంపతుల జీవితంలోకి అనుకోకుండా ఒక యువతి (హృతిక శ్రీనివాస్) ప్రవేశిస్తుంది. మొదట్లో అమాయకపు ఆరాధనగా ప్రారంభమైన ఆమె బంధం, మెల్లగా భర్తపై విపరీతమైన వ్యామోహంగా మారుతుంది. ఈ క్రమంలో ఆ దంపతుల జీవితం ఎలాంటి ఒడిదొడుకులకు లోనైంది, ప్రేమ-భయం మరియు మానసిక సంఘర్షణల మధ్య కథ ఎలాంటి మలుపులు తిరిగిందనే ఆసక్తికరమైన అంశాలతో ట్రైలర్‌ను అత్యంత ఉత్కంఠభరితంగా కట్ చేశారు. ఈ ట్రైలర్ ఆడియన్స్‌లో గట్టి క్యూరియాసిటీని పెంచుతోంది.
చరిత చిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విజువల్స్ అందించగా, కార్తీక్ కొడకండ్ల సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలో నటిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























