మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘నాగబంధం’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.
దర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నా మొదటి చిత్రం. నేను విమర్శకులకు, రివ్యూ రైటర్లకు అందరికీ గౌరవం ఇస్తాను. అంతిమంగా ప్రేక్షకుల నిర్ణయమే తుది నిర్ణయం. ఆడియన్స్ రెస్పాన్స్ మేరకు ఫస్ట్ హాఫ్‌లో ఒక సాంగ్ లెంగ్త్ ఎక్కువగా ఉందని భావించి దాన్ని తొలగించాం. అలాగే క్లైమాక్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉందని ట్రిమ్ చేశాం. కానీ కొంతమంది సినిమా రిలీజ్ కాకముందే రివ్యూలు ఇవ్వడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఈ సినిమాకు రెండున్నర ఏళ్ల ప్రయాణం ఉంది. అందరి కష్టం ఇందులో ఉంది.
ఇలాంటి సినిమాలను నమ్మి ముందుకొచ్చిన నిర్మాతలను, హీరోను మీరందరూ సపోర్ట్ చేయాలి. తప్పకుండా థియేటర్‌లో సినిమా చూసి మీ జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. అదే మాకు గొప్ప ఎనర్జీ ఇస్తుంది. ఇది ఫిక్షనల్ స్టోరీ కాదు. ఆఫ్ఘన్లు భారతదేశంపై దాడి చేశారు. ఆ సమయంలో ఆదిశంకరాచార్యులు నాగసాధువుల అనే వర్గాన్ని ఏర్పాటు చేసి మన దేవాలయాలను రక్షించారు. ఇది మన చరిత్ర. హిందువులను ఎంత దారుణంగా చంపారో, దేవాలయాలను ఎలా ధ్వంసం చేశారో పుస్తకాలలో ఆధారాలు ఉన్నాయి. వాటిలో పదిశాతం మాత్రమే నేను సినిమాలో చూపించాను. ఆ చరిత్రను నెక్స్ట్ జనరేషన్‌కు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాం. మీరందరూ సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























