కన్నడ సంచలనం, నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి టైటిల్ రోల్లో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ నుండి ఒక సాలిడ్ మ్యూజికల్ అప్డేట్ వచ్చింది. సందీప్ సింగ్ దర్శకత్వంలో రెండు భాగాలుగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మ్యాగ్నమ్ ఓపస్ చిత్రానికి ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు, నేషనల్ అవార్డ్ గ్రహీత అమిత్ త్రివేది సంగీతం అందించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చారిత్రక గాథలో ఉండే వీరత్వం, దేశభక్తిని ప్రతిబింబించేలా అద్భుతమైన పాటలను మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించేందుకు అమిత్ త్రివేది ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉండటంతో, మరో నేషనల్ అవార్డ్ విన్నర్ మరియు ప్రముఖ గీత రచయిత ప్రసూన్ జోషి ఈ సినిమాలోని అన్ని పాటలను రాయనున్నారు.
రిషబ్ శెట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ గా నటిస్తున్న ఈ భారీ హిస్టారికల్ డ్రామాలో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. లీడ్ కాస్టింగ్ నుండి టెక్నీషియన్స్ వరకు అందరూ నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్నవారే కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుండగా, పాన్-ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్ట్ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























