వారణాసి .. మరో 80రోజులు చాలు

Varanasi Shoot Needs Just 80 More Days

అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ గురించి ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఫ్రాన్స్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న జక్కన్న, ఈ సినిమా ప్రమోషన్స్ మరియు ప్రస్తుత స్టేటస్‌పై స్వయంగా నోరు విప్పారు. ఈ భారీ అడ్వెంచర్ చిత్రానికి సంబంధించిన మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ ఇప్పటికే విజయవంతంగా పూర్తయిందని ఆయన వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మరో 80 రోజుల్లో బ్యాలెన్స్ షూట్ ను కంప్లీట్ చేస్తామని తెలిపారు. పక్కనే నిర్మాత ఉన్నారనే విషయాన్ని నవ్వుతూనే గుర్తు చేస్తూ.. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికే టోటల్ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు.

ఈ సినిమా స్టోరీలైన్ విషయానికి వస్తే, ఇది ఒక శివ భక్తుడి చుట్టూ తిరిగే అత్యంత ఆసక్తికరమైన టైమ్-ట్రావెల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ టైటిల్ రోల్‌తో పాటు, ఒక స్పెషల్ ఎపిసోడ్‌లో ‘శ్రీరాముడి’గా కూడా కనిపించి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించనున్నారు. అలాగే ‘మందాకిని’గా ప్రియాంకా చోప్రా అలరించనుండగా.. ‘కుంభ’ అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న అత్యంత పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. గతంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందంటూ జరిగిన ప్రచారానికి రాజమౌళి గట్టి బ్రేక్ వేశారు. ‘వారణాసి’ రెండు పార్టులుగా కాకుండా ఒకే ఒక్క సాలిడ్ విజువల్ వండర్‌గా రాబోతుందని తేల్చి చెప్పారు. ఈ సినిమాను అనుకున్న తేదీకే అంటే ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.