విచారణకు రావాలి .. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

Nampally Court Issues Summons to Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి క్రిమినల్ కోర్టు షాక్ ఇచ్చింది.హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద గతేడాది (డిసెంబర్ 4, 2024న) ‘పుష్ప-2’ ప్రీమియర్ షో జరిగిన తొక్కిసలాట కేసులో కోర్టు సమన్లు జారీ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విచారణకు సంబంధించి వచ్చే సోమవారం అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. చిక్కడపల్లి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరిపి కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన తర్వాత నాంపల్లి కోర్టు ఈ సమన్లు పంపింది. ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చగా, అందులో థియేటర్ యాజమాన్యం ఎ-1 నుండి ఎ-10 (A1-A10) గా ఉన్నారు. అల్లు అర్జున్‌ను ఈ ఛార్జ్‌షీట్‌లో ఎ-11 (A11) నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. అల్లు అర్జున్‌తో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న మరో 19 మంది నిందితులకు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.

గతేడాది డిసెంబర్‌లో ‘పుష్ప 2’ స్క్రీనింగ్ సమయంలో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు విపరీతంగా ఎగబడటంతో సంధ్య థియేటర్ వద్ద తీవ్ర గందరగోళం, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాదకర ప్రమాదంలో రేవతి (39) అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.