నటసింహం నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘NBK 111’. విభిన్నమైన కథాంశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక అదిరిపోయే అఫీషియల్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో నటిస్తున్న లీడింగ్ లేడీ ఎవరనే సస్పెన్స్‌కు తెరదించుతూ.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ప్రాజెక్ట్‌లోకి అఫీషియల్‌గా ఎంట్రీ ఇచ్చింది. కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ‘వృద్ధి సినిమాస్’ ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతూ విడుదల చేసిన అఫీషియల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పోస్టర్లో కాజల్ అగర్వాల్ లుక్ చాలా పవర్ఫుల్ అండ్ క్లాసీగా కనిపిస్తోంది. కళ్లజోడు పెట్టుకుని, కాటన్ శారీ కట్టుకుని ఆఫీస్ టేబుల్ మీద కూర్చున్న కాజల్ లుక్ చూస్తుంటే.. ఆమె ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ లాయర్ లేదా ఒక సీరియస్ గవర్నమెంట్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో బాలకృష్ణ – కాజల్ కాంబినేషన్లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ‘NBK 111’ కోసం ఈ హిట్ కాంబో రిపీట్ కానుండటంతో అభిమానుల్లో అంచనాలు అప్పుడే స్కై హైకి చేరుకున్నాయి.
గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో సాలిడ్ ఇంటెన్స్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో మంచు మనోజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమాను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























