దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

Drishyam 3 OTT Release Date Locked

భారతీయ సినిమా చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా నిలిచిన ‘దృశ్యం’ సిరీస్ నుండి వచ్చిన మూడో భాగం ‘దృశ్యం 3’ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం, రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి మోహన్‌లాల్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక థియేట్రికల్ రన్ తర్వాత ఈ సాలిడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ నెల జూన్ 18 నుండి అఫీషియల్‌గా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.మలయాళం తోపాటు తెలుగు , కన్నడ , తమిళ భాషల్లో సఅందుబాటులోకి రానుంది. అయితే బాలీవుడ్ లో ఈసినిమాను అజయ్ దేవగన్ రీమేక్ చేస్తుండడంతో హిందీ భాషలో విడుదల చేయడం లేదు.

జార్జ్‌కుట్టి మరియు అతని కుటుంబం పోలీసుల నుండి, సరికొత్త సవాళ్ల నుండి ఎలా తప్పించుకుంది అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ మూడవ భాగాన్ని డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబావూర్ ఈసినిమాను నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.