భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన ప్రతిష్టాత్మక తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసాకపట్నం’ ప్రపంచవ్యాప్త ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ జూలై 2 నుంచిప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు ప్రశాంత్ రాఘతికథా రచన అందించగా, తాజుద్దీన్ సయ్యద్ సంభాషణలు రాశారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డిబొర్రా నిర్మించారు.
ఒక కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ‘ఇసాకపట్నం’ కథలోఅధికారం కోసం జరిగే పోరాటాలు, కుటుంబ విభేదాలు, రాజకీయకుట్రలు, గ్యాంగ్‌స్టర్ సంఘర్షణలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సిరీస్‌లో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించగా, సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ, రాజాచెంబోలు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్, అలాగేఇంగ్లీష్ సహా 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో ‘ఇసాకపట్నం’ జూలై 2 నుంచి భారతదేశంతో పాటు 240కి పైగా దేశాలు, ప్రాంతాల్లోప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
ఇదిలా ఉంటే, ప్రైమ్ డే సందర్భంగా ప్రైమ్ వీడియో అందిస్తున్నప్రత్యేక కంటెంట్ లైనప్‌లో ‘ఇసాకపట్నం’ కూడా ఒక ప్రధానఆకర్షణగా నిలవనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























