సంబరాల ఏటిగట్టు ముంబై షెడ్యూల్ లో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు

Sambarala Yeti gattu Wraps Up Its Mumbai Schedule

సాయి దుర్గా తేజ్ హీరోగా హనుమాన్ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రోహిత్ కేపీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’(SYG). సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ (సుమారు రూ. 125 కోట్లు) ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా షెడ్యూల్ నుండి షెడ్యూల్‌కు మరింత గ్రాండ్‌గా మారుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన ముంబై షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ షెడ్యూల్‌లోనే సినిమాలోని కొన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటెన్స్ సీన్లను చిత్రీకరించారు.

‘SYG’ భారీ కాన్వాస్‌ను మరింత నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ.. ఈ ముంబై షెడ్యూల్‌లో ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు చిత్ర యూనిట్‌తో చేరారు. ఆయన పాత్ర సినిమాకు లార్జర్ ద్యాన్ లైఫ్ అప్పీల్‌ను తీసుకురాబోతోందని, స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు.

ఈ ప్రాజెక్ట్ కోసం సాయి దుర్గా తేజ్ తన ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. శారీరకంగా, మానసికంగా ఎంతో ఇంటెన్స్‌గా ఉండే ఈ పవర్‌ఫుల్ రోల్ కోసం తేజ్ అద్భుతమైన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ అయ్యారు. గతంలో వచ్చిన ‘అసుర ఆగమన’ గ్లింప్స్‌లోనే తేజ్ ఊర మాస్ కటౌట్, కళ్లల్లో రౌద్రం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. తేజ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ మరియు కెరీర్ డిఫైనింగ్ పర్ఫార్మెన్స్‌గా ‘సంబరాల ఏటిగట్టు’ నిలవబోతోంది.

పక్కా 1980ల నాటి పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో, ల్యాండ్ అండ్ మినరల్స్ మాఫియా చుట్టూ తిరిగే హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. సినిమాలోని భారీ విజువల్స్, గ్రాండ్ మేకింగ్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా పర్‌ఫెక్షన్‌తో మేకర్స్ ముందుకు వెళ్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2026 లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి ఫీమేల్ లీడ్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, శ్రీకాంత్, సాయి కుమార్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.