మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల జల్లు కురిపించారు. గత రాత్రి ఈ సినిమా చూశానని చెప్తూ, తన సోదరుడు రామ్ చరణ్ నటన తన మైండ్ బ్లాక్ చేసిందని సోషల్ మీడియా వేదికగా ఎక్స్ (ట్విటర్) లో అల్లు అర్జున్ పోస్ట్ పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో చరణ్ కనబరిచిన గ్రిట్టీ అండ్ రా పర్ఫార్మెన్స్, ఆయన అసాధారణమైన బాడీ ట్రాన్స్ఫార్మేషన్, మరియు గ్రేస్‌ఫుల్ డాన్స్ మూవ్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. చరణ్ ప్రతి విభాగంలోనూ అదరగొట్టేశాడని, తన బ్రదర్‌ను చూసి నిజంగా చాలా గర్వపడుతున్నానని, ఈ సినిమాకు వస్తున్న చప్పట్లు, ప్రశంసలకు ఆయన పూర్తిగా అర్హుడని సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతి బాబు (జగ్గుభాయ్)తో పాటు ఇతర నటీనటులు కూడా అద్భుతమైన నటనను కనబరిచారని అభినందించారు. హీరోయిన్ జాన్వీ కపూర్‌కు తన ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తూ, సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
చివరగా ఈ ఓడకు కెప్టెన్ అయిన దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రతి ఒక్కరినీ ఎలివేట్ చేస్తూ, చరణ్‌ను సరికొత్త ఎత్తులో నిలబెట్టారంటూ ప్రశంసలు కురిపించారు. ‘పెద్ది’ టీమ్ మొత్తానికి అల్లు అర్జున్ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























