మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద అన్‌స్టాపబుల్ రన్‌తో దూసుకుపోతోంది. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 292.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఈరోజు తో 300క్లబ్ లో చేరనుంది.సోలో హీరోగా చరణ్ కు ఇదే మొదటి 300కోట్ల సినిమా కానుంది.
ఆదివారం సెలవు దినం కావడంతో 4వ రోజు ‘పెద్ది’ వసూళ్లలో భారీ జంప్ కనిపించింది. శనివారంతో పోలిస్తే ఆదివారం కలెక్షన్లు దాదాపు 10.6% పెరిగాయి. 4వ రోజు దేశవ్యాప్తంగా రూ. 31.90 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.
బుక్‌మైషో టికెట్ బుకింగ్స్‌లో కేవలం రెండున్నర రోజుల్లోనే ఏకంగా 2 మిలియన్ల టికెట్ల సేల్స్ సాధించి, అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న చిత్రాల్లో ‘RRR’ రికార్డును ‘పెద్ది’ సమం చేసి పుష్ప 2, కల్కి, బాహుబలి 2 తర్వాత స్థానంలో నిలిచింది.
సినిమాలో జాన్వీ కపూర్ (అచ్చియమ్మ) క్యారెక్టర్‌కు సంబంధించిన కొన్ని సీన్స్ పై సోషల్ మీడియాలో విమర్శలు రావడం, దానిపై దర్శకుడు బుచ్చిబాబు స్పందించి తప్పులు సరిదిద్దుకుంటామని క్షమాపణలు చెప్పడం లాంటివి జరిగినా.. బాక్సాఫీస్ వసూళ్లపై దాని ప్రభావం ఏమాత్రం పడలేదు.
సోమవారం (వర్కింగ్ డే) టెస్టును కూడా ఈ సినిమా ఇలాగే తట్టుకుంటే, లాంగ్ రన్‌లో ‘పెద్ది’ మరిన్ని భారీ రికార్డులను తిరగరాయడం ఖాయం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























