పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రణబాలి షూటింగ్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే విజయవంతంగా 100 రోజుల చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇటీవల గండికోటలో జరిగిన కీలక షెడ్యూల్‌తో దాదాపు 90 శాతం టాకీ పార్ట్‌ను ముగించుకుంది. బ్రిటీష్ పాలనా కాలంలో 1854 – 1878 మధ్య జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేసి, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, గుల్షన్ కుమార్ మరియు భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ పాన్-ఇండియా సినిమాలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తుండగా, రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ చారిత్రక కథలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూతో పాటు బెనెడిక్ట్ గారెట్, జెఫ్రీ గిలియానో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రమోద్ తమ్మినేని ఈ చిత్రానికి రచన అందించారు.
సాంకేతిక విభాగంలోనూ ఈ సినిమా కోసం అగ్రశ్రేణి నిపుణులు పనిచేస్తున్నారు. అజయ్ – అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిరవ్ షా ఛాయాగ్రహణ బాధ్యతలను, కార్తీక శ్రీనివాస్ ఆర్. ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో యానిక్ బెన్, ఆండీ లాంగ్ న్గుయెన్, రాబిన్ సుబ్బు ఫైట్ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. విఠల్ కోసనమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా, సునీల్ రాజు చింతా వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా వ్యవహరిస్తున్న ఈ భారీ చారిత్రక చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 11న గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























