మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెద్ది బాక్సాఫీస్ ఛాంపియన్ ప్రెస్ మీట్ లో నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ‘పెద్ది’ చిత్రం అద్భుతంగా దూసుకుపోతోంది. తొలి రోజే ₹135 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూసిన వారందరూ ఇది చాలా మంచి సినిమా అని అభినందిస్తున్నారు. ఇది నిజంగా బ్రహ్మాండమైన సినిమా. అందరూ తమ పిల్లలను తీసుకుని థియేటర్లలో సినిమా చూడండి. ఇది రామ్ చరణ్ గారి కెరీర్‌లో బెస్ట్ సినిమా. ఆ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. టికెట్ రేట్ల విషయంలో మాకు సహకరించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు.
భారీ స్థాయిలో, అత్యంత గ్రాండ్‌గా ఈ సినిమాను నిర్మించాం. ఆ కృషికి ప్రభుత్వాలు ఎంతో సానుకూలంగా స్పందించాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి కందుల దుర్గేష్ గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మరోసారి కృతజ్ఞతలు. చాలా కీలక సమయంలో వారు మాకు అండగా నిలిచారు. ఈ సినిమాను ప్రేక్షకులు చాలా దూరం తీసుకెళ్లారు. అందరూ సినిమాను నమ్మి అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టారు. మీడియా కి ధన్యవాదాలు. ఒక మంచి సినిమాకు మీరందరూ అండగా నిలిచారు. సినిమా గురించి అందరూ చాలా బాగా రాశారు. ఒక్క నెగెటివ్ లేకుండా పాజిటివ్‌గా ఆదరించారు. రామ్ చరణ్ గారికి, బుచ్చిబాబు గారికి మరోసారి ధన్యవాదాలు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నేను చేసిన తొలి సినిమాకే ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఇచ్చినందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అందరికీ థాంక్యూ సో మచ్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























