టాలీవుడ్ యంగ్ హీరో విరాట్ కర్ణ లీడ్ రోల్లో, అభిషేక్ నామా వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘నాగబంధం’. భారతీయ పురాణాలు, ప్రాచీన రహస్యాలు, దైవిక శక్తుల బ్యాక్డ్రాప్లో హై-సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పవర్హౌస్ ‘జీ స్టూడియోస్’ దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ మార్కెట్లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, మరియు హిందీ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయబోతోంది.ఇప్పటికే ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను కూడా జీ స్టూడియోస్ దక్కించుకుని, హిందీ మార్కెట్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.ఇప్పుడు ఓవర్సీస్ హక్కులు కూడా వారి చేతికే వెళ్లడంతో సినిమా బిజినెస్ రేంజ్ మరింత పెరిగింది.
ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిలీజ్కు ముందే ఈ సినిమా అటు డిజిటల్, ఇటు శాటిలైట్ హక్కుల పరంగా కూడా క్రేజీ డీల్స్ క్లోజ్ చేసుకుంది.ప్రముఖ డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
తెలుగు శాటిలైట్ హక్కులను ప్రముఖ ఛానెల్ స్టార్ మా దక్కించుకోగా, మిగతా భాషల శాటిలైట్ హక్కులు జీ స్టూడియోస్ వశమయ్యాయి. ఈ చిత్రంలోని హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలకు అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన స్టంట్ డైరెక్టర్ వ్లాడ్ రింబర్గ్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. నీటి అడుగున జరిగే యాక్షన్ ఎపిసోడ్లు , భారీ ట్రైబల్ యుద్ధాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, దక్షా నగార్కర్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























