గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. బాక్సాఫీస్ వసూళ్ల పరంగానే కాకుండా.. టికెట్ల అమ్మకాల పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషో లో ‘పెద్ది’ సినిమాకు సంబంధించి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ మరియు రిలీజ్ రోజు ఉదయం నాటికే ఏకంగా 1 మిలియన్ టికెట్లు అమ్ముడై సరికొత్త మైలురాయిని అందుకుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో టికెట్ రేట్ల పెంపు మరియు అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. బుకింగ్స్ ఓపెన్ అయినప్పటి నుండి గంటకు వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడవుతూ వచ్చాయి.రిలీజ్ రోజైన గురువారం నాటికే ఈ కౌంట్ 1 మిలియన్ దాటేసింది.
కేవలం ఒకే ఒక్క ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లోనే 10 లక్షలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయంటే.. ఇక థియేటర్ల వద్ద విండో టికెట్లు మరియు ఇతర ప్లాట్‌ఫామ్స్ కలుపుకుంటే మొదటి రోజు ‘పెద్ది’ సినిమా ఎవరూ ఊహించని రేంజ్‌లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం థియేటర్లలో ఇప్పటికే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























