ఇండియన్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ సెట్స్‌పై ఉన్న తరుణంలో ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ బర్త్‌డే నోట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎన్టీఆర్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ప్రశాంత్ నీల్‌కు విష్ చేస్తూ.. “హ్యాపీ బర్త్‌డే డైరెక్టర్ అవరే.. మీరు చెప్పే కథలంత గ్రాండ్‌గా ఈ ఏడాది మీకు సాగాలని కోరుకుంటున్నాను. మన కాంబినేషన్‌లో ముందుకు రాబోయే విశేషాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను ప్రశాంత్” అంటూ హార్టీ ఎమోజీని జోడించి రాసుకొచ్చారు.
ఇటీవలే తారక్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ‘డ్రాగన్’ టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పవర్‌ఫుల్ అండ్ రూత్‌లెస్ అస్సాసిన్ (హంతకుడు) పాత్రలో కనిపించబోతున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో అనిల్ కపూర్, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























