పెద్ది మీ అందరినీ ఇన్‌స్పైర్ చేస్తుంది – జాన్వి కపూర్

Janhvi Kapoor Confident Peddi Will Motivate Audiences

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం ఢిల్లీలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ప్రెస్ మీట్ లో హీరోయిన్ జాన్వి కపూర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నేను చాలా అద్భుతమైన పాత్ర చేశాను. డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఆ క్యారెక్టర్‌ను చాలా చక్కగా డిజైన్ చేశారు. నేను పూర్తిగా ఆయన విజన్‌ను ఫాలో అయ్యాను. రామ్ చరణ్ గారితో పనిచేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా రూటెడ్ ఫిల్మ్. ఇండియాలో, ఇండియన్స్ కోసం నిర్మించిన సినిమా. ఇలాంటి గొప్ప సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో హార్డ్‌వర్క్‌తో ఈ సినిమా చేశాం. తప్పకుండా జూన్ 4న ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ అందరినీ ఇన్‌స్పైర్ చేస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.