ది రెడ్ బ్యాగ్ నుండి  హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

Powerful Poster of Heroine Raadhya from The Red Bag Released

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి, మెమరీ మేకర్స్ బ్యానర్ మీద ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. రీసెంట్‌గా రాశీ పాత్రకు సంబంధించిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా హీరోయిన్ రాధ్య పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆమెను చూపించిన తీరు, గన్ను పట్టుకున్న విధానం, చేతిలో ఉన్న ఆ వస్తువు ఇలా అన్నీ హైలెట్ అవుతున్నాయి. పవర్ ఫుల్ లుక్‌లో రాధ్య అందరినీ ఆకట్టుకుంటోంది.  ప్రస్తుతం ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

తొలి సినిమానే అయినా, నిర్మాత  హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి శేఖర్ మోపురి సంగీతమందించగా.. ప్రియేష్ గురుసామి కెమెరామెన్‌గా, శివ శర్వాని ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే టీజర్‌తో మూవీపై మరింత బజ్ క్రియేట్ చేయనున్నారు.

నటీనటులు : కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, రాశి, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.