విక్టరీ వెంకటేష్ , నందమూరి కళ్యాణ్ రామ్ ల కాంబినేషన్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించనున్నారని తెలిసిందే . ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరు చేయబోతున్నారనే సస్పెన్స్ వీడింది.అనిల్ రావిపూడి గత రెండు సినిమాలకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో నే ఈసినిమాకు కూడా తీసుకుంటారనే ప్రచారం జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్, రాక్‌స్టార్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నారు. మేకర్స్ త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సరికొత్త ఎలిమెంట్స్, ఒక ఫ్రెష్ స్టోరీతో ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. జూలై లేదా ఆగస్ట్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదొక బిగ్గెస్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలవబోతోంది.
ఇటీవల సౌత్ ఇండస్ట్రీలో బ్యాక్‌టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ మ్యూజిక్‌తో దూసుకుపోతున్న జి.వి. ప్రకాష్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌లోకి రావడం సినిమా అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అనిల్ రావిపూడి మార్క్ హిలేరియస్ ఫన్ అండ్ యాక్షన్ సీన్లకు జీవీ ప్రకాష్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కమర్షియల్ సాంగ్స్ మెయిన్ అసెట్ కానున్నాయి.
హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ఈ మల్టీస్టారర్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. వచ్చే సంక్రాంతికి ఈసినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























