వదలా నుంచి బ్యూటీఫుల్ ఫ్యామిలీ మెలోడీ సాంగ్ రిలీజ్

Aa Ningi Ee Nela Lyrical song out from Vadhala Movie

వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, థ్రిల్లింగ్ టీజర్‌ , టైటిల్ ట్రాక్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా చిత్ర బృందం ‘ఆ నింగీ ఈ నేల’ అనే అందమైన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ మెలోడీని విడుదల చేసింది.

మనసును హత్తుకునే భావోద్వేగాలతో సాగే ఈ పాట కుటుంబ అనుబంధాలను ఎంతో అందంగా ఆవిష్కరిస్తోంది.

కృష్ణవేణి మల్లవజ్జల అందించిన సాహిత్యం పాటకు ప్రాణం పోయగా, కార్తీక్ కోడకండ్ల తన మధుర గానంతో మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. సంగీత దర్శకుడు కార్తీక్ బి. కోడకండ్ల స్వరపరిచిన ఈ మెలోడీ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.

జగపతి బాబు, లయల మధ్య కనిపించే సహజమైన ఫ్యామిలీ కెమిస్ట్రీ ‘ఆ నింగీ ఈ నేల’ పాటకు మరింత భావోద్వేగాన్ని తీసుకొచ్చింది.

ఈ చిత్రానికి చోటా కె నాయుడు డీవోపీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్, లక్ష్మీ భూపాల రైటర్.

తారాగణం: జగపతి బాబు, లయ, హృతికా శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, జెన్నీ, రీను, కశ్యప్ రాజ్

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.