మెగా 158 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్

Mega 158 Regular Shoot Kicks Off

మెగాస్టార్ చిరంజీవి , డైరెక్టర్ బాబీ కొల్లి ల క్రేజీ ప్రాజెక్ట్ మెగా 158 పట్టాలెక్కేసింది.నిన్న ఈసినిమా గ్రాండ్ గా లాంచ్ కాగా ఎలాంటి ఆలస్యం లేకుండా ఈరోజు నుండే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్‌లోని ప్రముఖ గవర్నమెంట్ సిటీ కాలేజ్ లొకేషన్‌లో ఈరోజు మొదటి షెడ్యూల్ చిత్రీకరణను మొదలుపెట్టారు. ఈ షూటింగ్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కూడా జాయిన్ అయ్యారు. సినిమాలో చిరంజీవి కూతురి పాత్రలో అనస్వర నటిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే కొన్ని కీలకమైన ఎమోషనల్ సీన్లను డైరెక్టర్ బాబీ ఈ షెడ్యూల్‌లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈచిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు కాకా అనే టైటిల్ పరిశీలనలో వుంది.వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇంతకుముందు చిరు-బాబీ కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో ఇప్పుడు అదే కాంబినేషన్ లో వస్తున్న మెగా 158 పై అంచనాలు భారీగా వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.