నార్త్ ఇండియాలో జీ స్టూడియోస్ ద్వారా విడుదలకానున్న నాగబంధం

Nagabandham to Be Released in North India by Zee Studios

అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణా నటించిన ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం జూలై 3న థియేటర్లలో ఘనంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ అప్‌డేట్‌తో ఈ చిత్రంపై బజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నార్త్ ఇండియాలో అన్ని భాషల థియేట్రికల్ రిలీజ్ పార్ట్నర్‌గా ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ చేతులు కలిపింది. ఎపిక్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ‘నాగబంధం’ను నార్త్ ఇండియాలో అన్ని భాషల్లో జీ స్టూడియోస్ గ్రాండ్‌గా విడుదల చేయనుంది.

ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్, రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మాంజ్రేకర్, జయప్రకాశ్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ‘నాగబంధం’ పౌరాణికం,చరిత్ర, యాక్షన్ అంశాల కలయికగా రూపొందుతోంది.
పాన్ ఇండియా స్థాయిలో ‘నాగబంధం’ జూలై 3న విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.