మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ మాస్ ఎంటర్టైనర్ ‘#Mega158’ (వర్కింగ్ టైటిల్) ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్ర ఓపెనింగ్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై, సినిమా ముహూర్తపు సన్నివేశానికి మొదటి క్లాప్ కొట్టారు.
ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం.. మెగా బ్రదర్స్ ముగ్గురూ ఒకే వేదికపై కనిపించడం. ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుకలో దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాతలు దిల్ రాజు, బండ్ల గణేష్ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
ఈ ఏడాది ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు స్కై హై లో ఉన్నాయి. ఈ సినిమాను బాబీ ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. సోషల్ మీడియాలో ఈ చిత్రం కోసం ‘కాకా’ అనే టైటిల్ గట్టిగా వినబడుతోంది.
ఎస్.ఎస్. తమన్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కీలక పాత్రలో కనిపించనుంది.
కన్నడలో భారీ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 28 నుండి హైదరాబాద్‌లోనే ప్రారంభం కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























