మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ప్రతి ప్రోమో దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్లు, పాత్రల గ్లింప్స్‌లు, పాటలు ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన ఈవెంట్ లో లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఈవెంట్ లో హీరోయిన్ జాన్వి కపూర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మేము గత రెండేళ్లుగా పని చేస్తున్నాం. మీ అందరితో కలిసి ట్రైలర్ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇది మాకు చాలా స్పెషల్ మూమెంట్. బుచ్చిబాబు గారు చాలా రౌడీ డైరెక్టర్ (నవ్వుతూ). తనకు కావాల్సిన ఔట్‌పుట్ వచ్చే వరకు వదిలిపెట్టరు. రెహమాన్ గారు మ్యూజిక్ చేసే సినిమాలో నటించడం ఒక గౌరవం. రామ్ చరణ్ గారితో కలిసి పని చేయడం నా జీవితంలో గొప్ప గౌరవం. అమ్మగారు, చిరంజీవి గారు నటించిన సినిమాలకు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు. మా కాంబినేషన్ కూడా ప్రేక్షకులకు ఎదురుచూశారు. ‘పెద్ది’ నాకు చాలా స్పెషల్ ఫిలిం. రామ్ చరణ్ గారు ద బెస్ట్ పర్సన్. ఈ సినిమాను మీరందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























