టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల , భారత యువ క్రికెటర్ తిలక్ వర్మలు డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఈ పుకార్లపై శ్రీలీల తల్లి స్వర్ణలత స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని స్వర్ణలత స్పష్టం చేశారు. ఈ వార్తల్లో అణువంత కూడా నిజం లేదని తేల్చి చెప్పారు. శ్రీలీల ప్రస్తుతం తన చదువు, సినిమాలతో చాలా బిజీగా ఉందని పేర్కొన్నారు. ఏ మాత్రం విరామం దొరికినా ఆమె నీట్-పీజీ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతోందని తెలిపారు. ఇలాంటి వ్యక్తిగత విషయాలు ఆలోచించడానికి ఆమెకు ఇంకా ఐదారు సంవత్సరాల సమయం ఉందని స్పష్టతనిచ్చారు.
2025 డిసెంబర్‌లో శ్రీలీల, తిలక్ వర్మ ఇద్దరూ తిరుమలను సందర్శించడం, అలాగే వాంఖడే స్టేడియంలో జరిగిన ఒక టీ20 మ్యాచ్‌లో శ్రీలీల సందడి చేయడం కేవలం కాకతాళీయంగా జరిగినవని.. వాటిని ఆధారంగా చేసుకుని తప్పుడు కథనాలు అల్లవద్దని ఆమె కోరారు.
గతంలో బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో కూడా శ్రీలీల రిలేషన్‌లో ఉందంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దానిపై కూడా స్వర్ణలత వివరణ ఇస్తూ.. “కార్తిక్ ఆర్యన్ తల్లి, నేను ఇద్దరం గైనకాలజిస్టులం. మా వైద్య వృత్తిపరంగా మేము కలుసుకున్నాము. కానీ దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుని శ్రీలీల, కార్తిక్‌లకు ముడిపెడుతూ వార్తలు రాశారు” అని గుర్తుచేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























