యువ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి, సరికొత్త నటీనటులతో రూపొందించిన రూరల్ డ్రామా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం మే 15 నుంచి సాధారణ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. అయితే ‘ఆహా గోల్డ్’ సబ్‌స్క్రైబర్లకు 24 గంటల ముందే, అంటే ఈరోజు నుంచే ముందస్తు స్ట్రీమింగ్ సౌకర్యం కల్పించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ సంపాదించుకుంది. వి. మునిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ విలేజ్ కామెడీ డ్రామాలో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా నటించగా, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు. దాదాపు 50 మంది కొత్త ఆర్టిస్టులను ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేయడం విశేషం.
ఈ సినిమా కథ 1996 కాలం నాటి రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. తిమ్మరాజుపల్లి అనే గ్రామంలోకి మొదటిసారి ఒక సొంత టీవీ వస్తుంది. ఊరంతా ఆ టీవీ చూస్తూ ఆనందిస్తున్న సమయంలో, అకస్మాత్తుగా ఆ టీవీ దొంగతనం అవుతుంది. ఆ నింద ఊరిలోని ఒక యువకుడిపై పడుతుంది. తనపై పడిన నిందను పోగొట్టుకోవడానికి ఆ యువకుడు ఏం చేశాడు? అసలు ఆ టీవీని ఎవరు దొంగిలించారు? అనే ఆసక్తికరమైన అంశాలతో వినోదాత్మకంగా మరియు హృదయానికి హత్తుకునేలా ఈ చిత్రాన్ని మలిచారు. వంశీకాంత్ రేఖానా అందించిన సంగీతం, పల్లెటూరి వాతావరణం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
























