ఆంధ్ర కింగ్ తాలూకా తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పటివరకు తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే రామ్ ఈసారి మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. దానికి కారణం వరుస పరాజయాలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాంతో తన నెక్స్ట్ సినిమా ‘RAPO 23’ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగా సినిమా ఆలస్యం అవుతుంది. ఇక ఎట్టకేలకు రామ్ తదుపరి సినిమా గురించి అప్డేట్ రానుంది. రామ్ తన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాతో ఒక కొత్త అడుగు వేయబోతున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, రామ్ పోతినేని ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మే 15న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ చైతన్య తన స్వంత బ్యానర్‌లో నిర్మించనున్నట్లు సమాచారం. రామ్ గత కొంతకాలంగా ఒక విభిన్నమైన స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారని, అందుకే ఈసారి మెగాఫోన్ పట్టాలని నిర్ణయించుకున్నారని టాక్.
‘RAPO 23’ ఒక అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే థ్రిల్లర్ అని లేదా స్టైలిష్ యాక్షన్ డ్రామా అని వేర్వేరు వార్తలు వస్తున్నాయి. దర్శకుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి రామ్ ఒక పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.: మే 15వ తేదీన రామ్ పుట్టినరోజు కావడంతో, అదే రోజున ఈ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా అనౌన్స్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























