వీరభద్రుడు లాంటి క్యారెక్టర్‌ను అన్నయ్య మాత్రమే చేయగలరు – కార్తి

Karthi Says His Brother Alone Could Do Justice to Veerabhadrudu

సూర్య మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వీరభద్రుడు’. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలని సృష్టించాయి. ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిలీజ్ అవుతుంది. మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో కార్తి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత సుప్రియా యార్లగడ్డ పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కార్తీ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మీ ప్రేమకి హృదయపూర్వక కృతజ్ఞతలు. షూటింగ్ జరుగుతుండగా ఇక్కడ ‘రోలెక్స్’ ఉన్నారని చెప్పారు. అందుకే హాయ్ చెప్పాలని వచ్చాను. ( నవ్వులు). ఈ సినిమా ఫస్ట్ లుక్ నాకు చాలా నచ్చింది. ఇది మాస్ మసాలా అలాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని కూడా చెప్పొచ్చు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్‌ని నేను చాలా ఎంజాయ్ చేశాను. గజని డేస్ గుర్తుకు వచ్చాయి. ఇలాంటి క్యారెక్టర్‌ను అన్నయ్య మాత్రమే చేయగలరు. ఆ మాస్ ఆయనకే సాధ్యపడుతుంది. నేను తప్పకుండా తెలుగు వెర్షన్ కూడా చూస్తాను. ఇలాంటి సినిమాలు థియేటర్‌లోనే చూడాలి. సినిమాను సెలబ్రేట్ చేసుకునే ప్రేక్షకుల కోసం తీసిన చిత్రం ఇది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే వెంకీతో చేస్తున్న సినిమా కూడా మీ అందరి ప్రేమను అందుకోవాలని ఆశిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.