యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మమల్ని సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్ యూ. లైలా మేడమ్ గారు ఎప్పుడు సెట్లోకి వచ్చినా వెయ్యి స్మైల్ ఎమోజీలు సెట్లోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా పాజిటివ్‌గా ఉంటారు. దర్శకుడు సుభాష్ చంద్ర ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. తనకి హ్యూమన్ ఎమోషన్స్, వాల్యూస్ బాగా తెలుసు. వాటినే అంత అద్భుతంగా సినిమాలోకి ట్రాన్స్‌లేట్ చేశాడు. ఈ సినిమా చూశాక మంచి హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా చూసిఎన్ని రోజులు అయిందో అనిపించింది. ఈ సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. సినిమా చూశాక తండ్రి – కూతుళ్ల ఎమోషన్ ఇంత బాగుంటుందా అనిపించింది.
ఈ సినిమాకి అదే హార్ట్. జగపతిబాబు గారిని ఆ క్యారెక్టర్‌లో చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఒక తండ్రి తన కూతుర్ని మిస్ అవుతున్న మూమెంట్ ఆలోచిస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఈ సినిమా చూసి బయటికి వచ్చిన ప్రతి అమ్మాయి “ఐ లవ్ యూ డాడీ” అని తమ ఫాదర్‌కి ఫోన్ చేసి చెప్తారు. అలాంటి అందమైన భావోద్వేగం ఈ సినిమాలో ఉంది. ఈ సమ్మర్‌లో మే 8న ఈ సినిమాను మీరందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను. మీ మూడ్ కూల్‌గా ఉండడానికి ‘గోదారి గట్టుపైన’ సినిమా మే 8న వస్తోంది. అందరూ ఫ్యామిలీతో కలిసి, ముఖ్యంగా ఆడపిల్లలు ఈ సినిమాను చూడండి. మీ డాడీకి “ఐ లవ్ యూ” చెప్పండి. అది చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది. మీ దగ్గర్లో ఉన్న థియేటర్స్‌లో చూడండి. మీ రెస్పాన్స్ నాకు సూపర్ బూస్ట్ ఇస్తుంది. నిర్మాత అభినవ్ గారికి, నటీనటులకు, టెక్నీషియన్స్‌కి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























