యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను, నా ఫ్రెండ్ ధీరజ్ కలిసి ఎంఆర్ ప్రొడక్షన్స్ స్థాపించాము. అందులో 100కు పైగా షార్ట్ ఫిలిమ్స్ తీశాము. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే కారణం నా స్నేహితుడు ధీరజ్ రాజు. తనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు. అలాగే నా ప్రయాణంలో నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ‘గోదారి గట్టుపైన’ సినిమా మా బాబాయ్ గారి నుంచి స్ఫూర్తి పొందింది. ఆయన 2017లో చనిపోయారు. ఆయన కూతురిని ఎక్కువగా ప్రేమించే తండ్రి. ఆయన క్యారెక్టర్ నే జగపతిబాబు గారికి ఇచ్చాము. పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాగ వంశీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే లిరిక్ రైటర్స్ అందరికీ థాంక్యూ. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కి పేరుపేరునా ధన్యవాదాలు. షూటింగ్‌లో సహకరించిన అందరికీ థాంక్యూ. నా డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యూ. ఇది ఒక మంచి సినిమాటిక్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. అందరూ కూడా థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి.
మేమందరం కలిసి ఒక బ్యూటిఫుల్ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. లాస్య, శ్రీవాణి గారు, రేణు అందరూ అద్భుతంగా చేశారు. హర్షవర్ధన్ గారు, రాజీవ్ కనకాల గారు, దేవి ప్రసాద్ గారు ఇలా ఎంతోమంది అనుభవం ఉన్న నటులు నన్ను ఎంతగానో ప్రోత్సహించి కంఫర్ట్ జోన్ ఇచ్చారు. లైలా గారికి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్‌ని. లైలా గారు, జగపతిబాబు గారి కాంబినేషన్ చాలా హుందాగా ఉంటుంది. జగపతిబాబు గారితో పని చేయడం చాలా అరుదుగా వచ్చే అవకాశం. ఆ అవకాశం ఇచ్చిన జగపతిబాబు గారికి థాంక్యూ. ఈ విషయంలో సునీల్ నారంగ్ గారికి, జాన్వీ నారంగ్ గారికి కూడా థాంక్యూ. ఆ క్యారెక్టర్‌కు జగపతిబాబు గారు అయితే బాగుంటారని వాళ్లే సజెస్ట్ చేశారు. జగపతిబాబు గారి సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిధి ప్రదీప్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేసింది. సుమంత్ ప్రభాస్ ఈ కథ విన్నాక “నేను మీకు పూర్తిగా సరెండర్ అవుతున్నాను, మీరు ఎలా కావాలంటే అలా ప్రజెంట్ చేయండి” అని చెప్పారు. తను ప్రమోషన్స్‌తో సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. తన భవిష్యత్తులో చాలా పెద్ద నటుడు అవుతాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమంత్‌కి థాంక్యూ. ఇప్పుడే ఫస్ట్ కాపీ చూసి వచ్చాను. ఈ సినిమా బ్లాక్‌బస్టర్. నా ఫస్ట్ సినిమా, సుమంత్ సెకండ్ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని నేను గర్వంగా చెప్తున్నాను. నిర్మాత అభినవ్ గారు నాకు పునర్జన్మనిచ్చారు. ఆయనకీ ఎప్పటికీ రుణపడి వుంటాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























