మళ్ళీ థియేటర్లలోకి గౌతమ్ నంద

Gautham Nanda Set for Re-Release in Theatres

మాచో స్టార్ గోపీచంద్ నటించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గౌతమ్ నంద మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు గ్రాండ్ రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19, 2026న థియేటర్లలో భారీ స్థాయిలో మళ్లీ విడుదల కానుంది. స్టైలిష్ మేకింగ్, పవర్‌ఫుల్ కథనం, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదల సమయంలోనే ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్న గౌతమ్ నంద చిత్రంలో గోపీచంద్ నటనకు విశేష స్పందన లభించింది. అలాగే హీరోయిన్లు కేథరిన్ థ్రెసా, హన్సిక మోత్వాని తమ గ్లామర్ మరియు నటనతో సినిమాకు మరింత ఆకర్షణ తీసుకువచ్చారు. సంగీత దర్శకుడు ఎస్ ఎస్. థమన్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చిత్ర విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్‌కు భారీ స్పందన వస్తున్న నేపథ్యంలో గౌతమ్ నంద రీ-రిలీజ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీకే ఎంటర్టెన్మెంట్స్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఈ రీ-రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు. మళ్లీ పెద్ద తెరపై గోపీచంద్ స్టైలిష్ అవతార్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.