గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న “పెద్ది” సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పుడే ప్రకంపనలు సృష్టిస్తోంది. థియేట్రికల్ ట్రైలర్ ఇంకా విడుదల కాకముందే ఈ చిత్రం రికార్డుల వేట మొదలుపెట్టింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా మేనియా స్పష్టంగా కనిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నార్త్ అమెరికాలో బుకింగ్స్ ప్రారంభమైన కేవలం నాలుగు గంటల్లోనే 100K డాలర్ల మార్కును దాటి ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏ భారతీయ సినిమాకు సాధ్యం కాని రీతిలో, అతి తక్కువ సమయంలో ఈ మైలురాయిని చేరుకోవడం రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. జూన్ 3వ తేదీన ఓవర్సీస్లో భారీ ఎత్తున ప్రీమియర్లు ప్లాన్ చేస్తుండగా, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ ఒక మల్లయోధుడిగా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే విడుదల కానున్న ట్రైలర్ సినిమాపై అంచనాలను మరిన్ని రెట్లు పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























