మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చిత్ర బృందం ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్తో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పెద్ది రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. మీడియా అందరికీ థాంక్యూ. ఉప్పెన క్లైమాక్స్ చూసినప్పుడు ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఎలాంటి సినిమా అయినా చేయగలడు అనిపించింది. బుచ్చిబాబు పెద్ది కోసం మంచి స్క్రిప్ట్ రాశాడు. ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ని అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. అలాంటి బ్యాలెన్స్ పట్టుకోవాలంటే చాలా అనుభవం ఉండాలి. పెద్ది లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్యకాలంలో రాలేదు. స్క్రీన్ పై సాంగ్స్ చూసినప్పుడు సినిమా వేరే లెవెల్లో అనిపించింది. రత్నవేలు గారు గ్రేట్ విజువల్స్ ఇచ్చారు. చరణ్‌ని అద్భుతంగా చూపించినందుకు థాంక్యూ. మొన్న వచ్చిన టీజర్ విజువల్స్ మామూలుగా లేవు. సతీష్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన మొదటి సినిమాకే రామ్ చరణ్ లాంటి హీరో, బుచ్చిబాబు లాంటి దర్శకుడు దొరకడం ఆయన అదృష్టం.
చరణ్ డాన్స్ చూస్తుంటే మాటలు రావడం లేదు.. అంత అద్భుతమైన ఎనర్జీతో డాన్స్ చేశాడు. ‘పెద్ది’లో చరణ్ పర్ఫార్మెన్స్ రంగస్థలం ను దాటి నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. బుచ్చిబాబు, సతీష్ గారికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రామ్ చరణ్‌కు థాంక్యూ. ఇందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కూడా థాంక్యూ. జూన్ 4న సినిమా విడుదల అవుతోంది. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. హిందీలో జియో వారు విడుదల చేస్తున్నారు. అక్కడ కూడా భారీ రిలీజ్ ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. సినిమాను సూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























