మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చిత్ర బృందం ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జూన్ ప్రారంభంలో రిలీజ్ కావడం వల్ల సమ్మర్ హాలిడేస్ చివరి దశలో థియేటర్స్ లో ప్రేక్షక ఆదరణ అందుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైం. అకడమిక్ సీజన్ మొదలయ్యే ముందు దేశ వ్యాప్తంగా మంచి ఫుట్‌ఫాల్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఒక అద్భుతమైన స్పెషల్ సాంగ్ చిత్రీకరణను చిత్ర బృందం పూర్తి చేయడంతో అధికారికంగా ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయి. ఈ ఎనర్జిటిక్ సాంగ్ ‘పెద్ది’ చిత్రంలోని మెయిన్ హైలెట్స్ లో ఒకటిగా నిలవనుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్ గా వేగంగా సాగుతున్నాయి.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, అనుభవజ్ఞులైన నటులు శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక పెద్ది రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్ మీట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్ కు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సుకుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ: మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. రామ్ చరణ్ గారికి జీవితకాలం రుణపడి ఉంటాను. నా మొదటి సినిమాగా ఇంత పెద్ద సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. బుచ్చిబాబు చాలా అద్భుతంగా సినిమా తీశారు. రామ్ చరణ్ గారు, జాన్వి కపూర్ గారు ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే సినిమా ఇది. తప్పకుండా థియేటర్లకు వచ్చి చూడండి. పెద్ది కమర్షియల్, ఎమోషనల్ రైడ్ ఇది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ థియేటర్స్ లో చూడగలిగే సినిమా. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది, నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నాను. జూన్ 4న సినిమా రిలీజ్ అవుతోంది. జూన్ 3 ఈవెనింగ్ అన్ని చోట్ల ప్రీమియర్స్ ఉంటాయి. షూటింగ్ జరిగిన రోజులన్నీ రామ్ చరణ్ గారితో కలిసి భోజనం చేసే అవకాశం దొరికింది. ఆయన ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనం మాకు పెట్టేవారు. ఆ అనుభవం నా జీవితంలో మర్చిపోలేనిది. ఈ వేడుకకు విచ్చేసిన సుకుమార్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో సుకుమార్ గారు కూడా నాకు పార్ట్నర్‌గా ఉండడం చాలా సంతోషంగా ఉంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























