మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లితో కలిసి మెగాస్టార్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. #ChiruBobby2 చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. లుక్ టెస్ట్ చూస్తుంటే మెగాస్టార్ పవర్‌ఫుల్, స్ట్రైకింగ్ లుక్ లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. చిరంజీవి కొత్త షేడ్‌లో కనిపించనున్నట్లు పోస్టర్ హింట్ ఇచ్చింది. ‘వాల్తేర్ వీరయ్య’ బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మాస్ ఎంటర్టైన్మెంట్‌ను తనదైన స్టైల్‌లో అద్భుతంగా అందించే బాబీ కొల్లి, ఈసారి మెగాస్టార్ కోసం మరింత ఇంటెన్స్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత ఎలివేట్ చేసేలా స్క్రిప్ట్ సిద్ధమౌతోంది. ఈ కాంబో నుంచి హై-ఆక్టేన్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ రాబోతుంది.త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తం, రెగ్యులర్ షూటింగ్ వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























