గాయపడ్డ సింహం ట్రైలర్ వచ్చేసింది

Trailer of Gayapadda Simham Released

తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన ‘గాయపడ్డ సింహం’ట్రైలర్ ఈరోజు విడుదలైంది. మలయాళ స్టార్ దదుల్కర్ సల్మాన్ ఈ ట్రైలర్ ను లాంచ్ చేశాడు.ఇక ఈ ట్రైలర్ ఎంటర్టైనింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది. అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని కలలుగనే ఒక యువకుడు, అక్కడ డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న అకస్మాత్తు నిర్ణయాల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనే అంశాన్ని దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ ఎంతో వ్యంగ్యంగా, హాస్యభరితంగా ఈ చిత్రంలో చూపించనున్నాడు. ట్రైలర్‌లో తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీ టైమింగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, పవన్ సాదినేని సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. స్వీకర్ అగస్తీ అందించిన సంగీతం మరియు విద్యాసాగర్ చింతా ఛాయాగ్రహణం ట్రైలర్‌లో ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘పెళ్లి చూపులు’ సినిమా ప్రస్తావనతో తరుణ్ భాస్కర్ తనపై తాను వేసుకున్న జోకులు నెటిజన్లను నవ్విస్తున్నాయి.

నటీనటుల విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ సరసన ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. సీనియర్ నటుడు జె.డి. చక్రవర్తి ‘బ్రూటల్ ధర్మ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా, హర్షవర్ధన్, విష్ణు ఓయ్, సుభలేఖ సుధాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.