బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కింగ్’ . షారుక్ సొంతం చిత్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈసినిమాను నిర్మిస్తుంది. అయితే ఈసినిమా విడుదల తేదీ మారనుందని ఇటీవల వార్తలు రాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం డిసెంబర్ 24, 2026న (క్రిస్మస్ కానుకగా) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ మరోసారి ప్రకటించారు.సో కింగ్ అనుకున్న తేదీకే థియేటర్లలోకి రానుంది.ఈ సందర్బంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.గ్లింప్స్ లో వినిపించిన “డర్ నహీ, దెహషత్ హూన్” (భయం కాదు, భీభత్సాన్ని) అనే డైలాగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షారుక్ ఖాన్‌తో పాటు ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ సినిమా ద్వారా షారుక్ కుమార్తె సుహానా ఖాన్ వెండితెరకు పరిచయం కాబోతోంది.ఇతర కీలక పాత్రల్లో అభిషేక్ బచ్చన్, అనీల్ కపూర్, జాకీ ష్రాఫ్, రాణి ముఖర్జీ నటిస్తున్నారు.
‘పఠాన్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది.
ఈ సినిమాలో షారుక్ ఖాన్ మెరిసే తెల్ల జుట్టుతో రఫ్ అండ్ టఫ్ యాక్షన్ అవతారంలో కనిపించనున్నారు. హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’తో పోటీ పడకుండా, ఒక వారం ఆలస్యంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























