వారణాసి క్రేజీ అప్‌డేట్: మెక్సికోలో ప్రత్యేక గ్లింప్స్ ప్రదర్శన

Varanasi Glimpse Set for Special Screening in Mexico

ఎస్‌ఎస్‌ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.ఈ నెల 24 నుండి 26 వరకు మెక్సికోలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్ వేడుకలో ‘వారణాసి’ చిత్ర సందడి షురూ కానుంది. ఈ గ్లోబల్ వేదికపై సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ మేకింగ్ వీడియోలు, బిహైండ్ ది సీన్స్ మరియు చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలతో కూడిన గ్లింప్స్‌ను ప్రేక్షకులకు ప్రదర్శించనున్నారు. రాజమౌళి కుమారుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ ఈవెంట్‌కు స్వయంగా హాజరవుతుండగా, జక్కన్న వీడియో కాల్ ద్వారా అక్కడి అంతర్జాతీయ అభిమానులతో ముచ్చటించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ బాబు సరసన అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇది ఒక ‘గ్లోబల్ జంగిల్ అడ్వెంచర్’ మూవీ. ఇండియాలోని వారణాసి పుణ్యక్షేత్రం నుండి మొదలై ఆఫ్రికా అడవుల వరకు సాగే సాహసోపేతమైన కథాంశంతో ఈ సినిమాను రాజమౌళి రూపొందిస్తున్నారు.

దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

ప్రపంచ సినిమా చరిత్రలోనే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7, 2027న ఐమ్యాక్స్ ఫార్మెట్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని, కఠినమైన శిక్షణ తీసుకున్నారు. మెక్సికో ఈవెంట్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ స్థాయిలో భారీ హైప్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.