నేను నా పల్లెటూరు సాంగ్ రిలీజ్

Nenu Na Palleturu song from Godari Gattupaina out now

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ అద్భుతమైన స్పందన వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు మేకర్స్ ‘గోదారి గట్టుపైన’ నుంచి ‘నేను నా పల్లెటూరు’ పాటను విడుదల చేశారు. పాట వినగానే అందమైన పల్లె జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. నాగ వంశీ కృష్ణ స్వరపరిచిన ఈ మెలోడీ పల్లెటూరి మట్టి వాసన, గోదావరి తీరాల అందంని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.

రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు పల్లెటూరి ఆత్మని హత్తుకునేలా చూపిస్తున్నాయి. ఎంఎల్‌ఆర్ కార్తికేయ వోకల్స్ ఈ పాటకు మరింత ప్రాణం పోసింది.  ఈ సాంగ్‌లో సుమంత్ ప్రభాస్ తన ఫ్రెండ్స్‌తో గడిపే సరదా క్షణాలని, పల్లెటూరి సింపుల్ లైఫ్‌ను ఎంతో సహజంగా చూపించారు. ఆ సన్నివేశాలు అందరికీ కనెక్ట్ అవుతున్నాయి. ఈ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఇన్‌స్టంట్ హిట్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రాని సినిమాటోగ్రఫీని సాయి సంతోష్, ప్రొడక్షన్ డిజైన్‌ను ప్రవాల్య, ఎడిటింగ్‌ను అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైన్‌ను నాగార్జున తల్లపల్లి నిర్వహిస్తున్నారు.ఈ చిత్రం మే 8న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.