ఎన్టీఆర్ నీల్ బిగ్ అప్డేట్ .. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

NTR–Neel Project Gets New Release Date

ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం ఎన్టీఆర్ నీల్ కొత్త విడుదల తేదీ ఖరారైంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గతంలో ఈ సినిమా 2026లో వస్తుందని భావించినప్పటికీ, ఇప్పుడు ఒక ఏడాది ఆలస్యంగా రాబోతోంది.ఈ సందర్భంగా పోస్టర్‌ లో వున్న “HIS REIGN… HIS SOIL” (అతని పాలన… అతని నేల) అనే ట్యాగ్ లైన్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తోంది.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే నెల మే 20, 2026న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.