మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ విడుదల మరోసారి వాయిదా పడింది.ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30, 2026న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే, తాజాగా సినిమా విడుదలను జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమాలోని టాకీ పార్ట్ పూర్తయినప్పటికీ, ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇంకా మిగిలి ఉంది. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నాణ్యత తగ్గకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మే నెలలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఉండటం వల్ల కూడా వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే జూన్ నెల అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా అడ్వాన్స్ బుకింగ్స్‌ను నిలిపివేసి, సినిమా జూన్‌కు షిఫ్ట్ అయినట్లు సంకేతాలిచ్చారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జానీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 70వ దశకపు ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగే ఈ కథపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























