డెకాయిట్ చాలా ఎంజాయ్ చేశాను – రామ్ చరణ్

Ram Charan All Praise for Adivi Sesh’s Dacoit

అడివి శేష్ ‘డెకాయిట్’ ఆయనకు డబుల్ హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే లాభాల బాట పట్టగా, నిర్మాత సుప్రియా యార్లగడ్డ ప్రారంభంలోనే లాభాలను అందుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీల పాజిటివ్‌ రెస్పాన్స్ తో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి పెరుగుతున్న ఆదరణకు మరింత బలాన్ని చేకూరుస్తూ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘డెకాయిట్’ చూసిన తర్వాత సోషల్ మీడియాలో చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. హరి పాత్రలో అడివి శేష్ అంకితభావంతో నటించిన తీరును ఆయన ప్రశంసించారు. శేష్ నటన గుర్తుండిపోయేలా ఉందని కొనియాడారు. మృణాల్ ఠాకూర్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ను, కథనానికి ఆమె అందించిన ఎమోషనల్ డెప్త్ ని కూడా చరణ్ అభినందించారు.

డెకాయిట్ చూశాను, చాలా ఎంజాయ్ చేశాను. హరి పాత్రలో అడివి శేష్ అద్భుతమైన, గుర్తుండిపోయే నటనను కనబరిచారు. మృణాల్ చాలా అద్భుతంగా ఉన్నారు, తన పాత్రకు వన్నె తీసుకొచ్చారు. అనురాగ్ కశ్యప్ గారు, చిత్ర బృందం మొత్తం తమ బలమైన నటనతో ప్రత్యేకంగా నిలిచారు.సుప్రియ యార్లగడ్డ గారు, అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రానికి పూర్తి నమ్మకంతో మద్దతు ఇచ్చి, ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో తీర్చిదిద్దారు’ అని చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు రామ్ చరణ్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.