హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌లో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు, శౌర్యను మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీదేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఈ నెల 17న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా నిర్మాత శ్రీనివాస్ గారు ఈ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాతో ఆయనకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఆయన మరిన్ని మంచి సినిమాలు తీయాలి. రసూల్ గారు లేకపోతే ఈ జర్నీ ఇలా పూర్తి అయ్యేది కాదు. ఈ సినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నేనూ థియేటర్‌లో ఈ సినిమా చూడడానికి వెయిట్ చేస్తున్నాను. నాగశౌర్య గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక కొత్త కథలో మేమిద్దరం కలిసి పనిచేయడం చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. శౌర్య గారు చాలా మంచి యాక్టర్. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. విధికి తెలుగులో మంచి సక్సెస్‌ఫుల్ కెరీర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా మొత్తం చాలా బాగుంటుంది. మీ అందరి ఆశీస్సులు మా సినిమా మీద ఉండాలి. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ థాంక్యూ సో మచ్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































