రేజర్ రిలీజ్ డేట్ లాక్

Makers Lock Release Date for Razor

టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ‘రేజర్’ సోషల్ మీడియాలో మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేసింది. టైటిల్ వీడియో, విజువల్స్, అందరిలో క్యురియాసిటీ పెంచాయి. ఈ చిత్రానికి అద్భుతమైన పాజిటివ్ బజ్ లభించడంతో ప్రేక్షకులలో అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మేకర్స్ ‘రేజర్’ షూటింగ్‌ను ఫిబ్రవరిలో పూర్తి చేశారు. పోస్ట్-ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు ఇప్పుడు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకునే దశలో ఉంది. థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

చిత్ర బృందం ఈరోజు ‘రేజర్’ వరల్డ్ ని పరిచయం చేసేలా ఆకట్టుకునే కొత్త పోస్టర్లను విడుదల చేసింది. కొత్త పోస్టర్లు ‘రేజర్’ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. అర్బన్, ఇండస్ట్రియల్ షాడోస్ మధ్య ఇంటెన్స్ పవర్ ఫుల్ గా కనిపించిన రవిబాబు లుక్ ఆకట్టుకుంది. ఒక పోస్టర్‌లో చిన్నారి చేతిని పట్టుకుని వీధిలో నడుస్తూ కనిపించడం సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

దర్శకుడు రవి బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ ని పంచుకున్నారు. తన తండ్రి చలపతి రావు గారి జయంతి అయిన మే 8, 2026న ‘రేజర్’ విడుదల కానుందని ప్రకటించారు.  

రచన, దర్శకత్వంతో పాటు ఈ చిత్రంలో రవిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది.‘రేజర్’ మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.