డెకాయిట్‌ నేను చేయడానికి మొదటి కారణం ఆయనే – మృణాల్ ఠాకూర్

He Is the First Reason I Chose Dacoit says Mrunal Thakur

చాలా గ్యాప్ తరువాత హీరో అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ,పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డెకాయిట్‌ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ మృణాల్ ఠాగూర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. వెంకటేష్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా నేను చేయడానికి మొదటి కారణం డైరెక్టర్ శౌర్యువ్ గారు. ఆయనే మొదట ఈ సినిమా గురించి నాకు చెప్పారు. కథ విన్నాక చాలా నచ్చింది. సరస్వతి క్యారెక్టర్ నా కెరీర్ లో గుర్తుండిపోతుంది. శేష్ గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సుప్రియ గారికి థాంక్యూ డైరెక్టర్ శానిల్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. సరస్వతి క్యారెక్టర్ ని అద్భుతంగా చూపించారు. సుప్రియ గారు చాలా కేరింగ్ ప్రొడ్యూసర్ అందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వెంకటేష్ గారి ఎదురుగా నిలబడి మాట్లాడటం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.