యంగ్ హీరో అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ,పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో అడివి శేష్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం డెకాయిట్ సినిమా ఎట్మాస్లో చూశాక చాలా నచ్చింది, ప్రాణం పెట్టి చేశాను. చాలా గ్రేట్ ఫుల్ గా అనిపించింది. మనం కోరుకున్న ఒక డ్రీమ్ ని నెరవేర్చాలని ఇంతమంది అహర్నిశలు కష్టపడ్డారు. మా డైరెక్టర్ శానిల్ ఇప్పటికీ ఆరు రాత్రులు పడుకోకుండా వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఇంకో గంటలో ఓవర్సీస్ పంపించాలి. ఇద్దరం కలిసి కన్న ఒక డ్రీమ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి తను ఇక్కడ లేకుండా వర్క్ లో ఉన్నాడు. ఈ సినిమా సుప్రియ గారి సపోర్ట్ మీద నిలబడింది. ఐదు సినిమాలు చేస్తే చాలు అనుకునే నేను ఈరోజు ఇలా మీ ముందు ఉండడం.. ప్రేక్షకుల అభిమానం. వెంకటేష్ గారికి సిద్ధూ కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పవన్ సింగ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం అందరూ ప్రేమతో పని చేశారు. నా నుంచి సక్సెస్ లు చూశారు అంతకుముందు ఫెయిల్యూర్ లు కూడా చూశారు. కానీ ఈ సినిమాలో మేము సినిమాని ఎంత ప్రేమించామో చూస్తారు. ఈ రెండేళ్ల జర్నీలో మాతో పాటు నడిచిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మృణాల్ క్యారెక్టర్ ఇంటర్వ్యూలో పిచ్చెక్కిస్తుంది. ఇంటర్వెల్ లో తనే హైలెట్. ఇంటర్వెల్ అలా రావడానికి కారణం సుజిత్. మేము ఒరిజినల్ గా ఒక ప్రేమ కథ అనుకున్నాం. కానీ ఈ రెండేళ్ల జర్నీలో అందరూ కూడా ఎంతో ప్రేమని అందించారు. ఏప్రిల్ 10 మీరందరూ కూడా ఒక హానెస్ట్ సినిమాను చూస్తారు. మా పాషన్ ని చూస్తారు. అందరికీ థాంక్యూ సో మచ్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























