మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’ ఓవర్సీస్ హక్కులు అత్యంత భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ఈ రైట్స్ ను దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రాన్ని సక్సెస్ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తుండటంతో సినిమాపై ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన పాజిటివ్ బజ్ ఉంది. ‘ఇరుముడి’ అనే టైటిల్ మరియు రవితేజ ఫస్ట్ లుక్ చూస్తుంటే, ఇది ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.
ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, సాయి కుమార్ మరియు బేబీ నక్షత్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉన్నప్పటికీ, ముందే ఓవర్సీస్ డీల్ క్లోజ్ అవ్వడం ఈ ప్రాజెక్ట్ రేంజ్‌ను తెలియజేస్తోంది. 2026లో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రవితేజకు కం బ్యాక్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























