రాకాస సినిమాకు పెయిడ్ ప్రీమియర్లు 

Rakasa Gears Up for Paid Premieres

సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాకాస’ చిత్రం ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్‌ను క్యాష్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఒక రోజు ముందుగానే, అంటే రేపు సాయంత్రం నుండి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెయిడ్ ప్రీమియర్లకు ప్లాన్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్‌తో పాటు వైజాగ్, విజయవాడ వంటి నగరాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో రేపు సాయంత్రం 6 గంటల నుండి ఈ ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి. సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బుక్ మై షో వంటి యాప్స్‌లో ఈ ప్రీమియర్ షోల టికెట్ బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇది ఒక ఫాంటసీ కామెడీ థ్రిల్లర్. పదేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఒక ఎన్నారై, అనుకోకుండా ఒక ప్రాచీన చీకటి శక్తులను మేల్కొలిపితే ఏం జరిగింది అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

సంగీత్ శోభన్, నయన్ సారికతో పాటు గెటప్ శ్రీను, ఆశిష్ విద్యార్థి, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు.
నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించగా, మానస శర్మ దర్శకత్వం వహించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. ఈ సినిమా నిడివి 2 గంటల 13 నిమిషాలుగా లాక్ అయింది. దీనికి సెన్సార్ బోర్డు నుండి UA సర్టిఫికేట్ లభించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.