సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి -దిల్ రాజు మూవీ ఫిక్స్

Salman Khan, Vamshi Paidipally & Dil Raju Join Hands for Film

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, మరియు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది. ఈ క్రేజీ కాంబో గురించి నేడు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన వెలువడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సల్మాన్ ఖాన్ స్వయంగా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వంశీ పైడిపల్లితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. “దిల్, దిమాగ్, జిగర్ సే, ఫ్రమ్ దిస్ ఏప్రిల్” (Dil, Dimag, Jigar se from this April) అని క్యాప్షన్ ఇచ్చారు. దీనితో ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల (ఏప్రిల్ 2026) నుండి ప్రారంభం కాబోతున్నట్లు స్పష్టమైంది.

దిల్ రాజు తన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది ఈ బ్యానర్‌లో వస్తున్న 63వ సినిమా.ఈ సినిమాలో సల్మాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించవచ్చని టాక్. ఈ చిత్రాన్ని 2027 ఈద్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇక ‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’, ‘మహర్షి’, ‘వారసుడు’ వంటి హిట్ సినిమాలను అందించిన వంశీ పైడిపల్లికి ఇది బాలీవుడ్ డెబ్యూ ఫిలిం. ఒక తెలుగు దర్శకుడు నేరుగా సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.