రాగ్ మయూర్ హీరోగా, డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనుమాన పక్షి’. చిలకా ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహనిర్మాత. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా నుంచి గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేసిన ఈ పాటని వెటరన్ సింగర్ రమణ గోగుల పాడిన తీరు కట్టిపడేసింది. కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అనుమాన పక్షి సినిమా కంటెంట్ చాలా నచ్చింది. డైరెక్టర్ విమల్ తో మేము ఒక సినిమా చేయాలనుకున్నాం. కొంత స్క్రిప్ట్ వరకు కూడా జరిగింది. కాకపోతే అది మెటీరియలైజ్ కాలేదు. రాజీవ్ తో మాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. వాళ్ళది ఆనిమేషన్లో చాలా స్ట్రాంగ్ కంపెనీ. డిజె టిల్లు తర్వాత మళ్లీ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ విమల్ రాసుకున్నాడు. మనం ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో రోజు అనుమాన పడుతూనే ఉంటాం. అలాంటి ఐడియాతో స్క్రిప్ట్ రెడీ చేశారు. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్ చేస్తున్నారు. రాగ్ మయూర్ చాలా టాలెంటెడ్. శ్రీ చరణ్ నాంది గూడచారి డి జె టిల్లు లాంటి డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా కంటెంట్ కొంత చూశాను, చాలా ఫన్ వుంది. ఈ సినిమాని మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.తప్పకుండా చూస్తాను. చూసాక సినిమా గురించి ఇంకా మాట్లాడుతాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























